వైసీపీని గెలిపించాలని మంత్రి అమర్నాథ్ అభ్యర్ధన
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని మరోసారి గెలిపించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రజలను కోరారు. అనకాపల్లి సత్యనారాయణపురంలో నిర్మించిన టిడ్కో గృహాలను టీటీడీ మాజీ చైర్మన్ వై. వి.సుబ్బారెడ్డి, ఎంపీ బీసెట్టి సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ లతో కలిసి పంపిణీ చేశారు. మొత్తం 2744 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రజలను అన్నివిధాలా ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Discussion about this post