అప్పులతో కాకుండా అభివృద్ధి చేసిన రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంతో యువనేత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2014లో చంద్రబాబునాయుడు సున్నాతో పాలన ప్రారంభించారన్నారు. గత అయిదేళ్లలో జగన్ విధ్వంస పాలన కారణంగా 30ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. జగన్ మూడు ముక్కలాటతో తీవ్రంగా నష్టపోయాం. అటు విశాఖ, ఇటు అమరావతి, కర్నూలు ఏదీ అభివృద్ధి చెందలేదు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయి. ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నారు. గత అయిదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తామని లోకేష్ చేప్పారు.
రాష్ట్రంలో ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని లోకేష్ మండిపడ్డారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, జగన్ మూడు ముక్కలాటతో తీవ్రంగా నష్టపోయామని ఆయన విమర్శించారు. అటు విశాఖ, ఇటు అమరావతి, కర్నూలు ఏదీ అభివృద్ధి చెందలేదు సరికదా.. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయని లోకేష్ మండిపడ్డారు.
Discussion about this post