అనకాపల్లి జర్నలిస్ట్ : ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పత్రికా కార్యాలయాలు, జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి… మీడియాపై దాడులు ఆపండి అంటూ జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికార పార్టీ వర్గాలు పత్రికలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతుంటే ప్రభుత్వం మాత్రం వార్తలు చూస్తూ ఉండడం విచిత్రంగా ఉందన్నారు.
Discussion about this post