ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రతిపక్ష నేతలకు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి సైన్యంగా తాము చర్చకు సిద్ధమే… యుద్ధానికి సిద్ధమే అని ప్రకటించారు. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత జగన్ సర్కారుదే అన్నారు..
ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో గ్రామాల్లోకి వెళ్లిందని… అక్కడే అధికార వ్యవస్థను ఏర్పాటు చేసిందని అన్నారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, సుజల స్రవంతిలపై మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను తాము చేస్తున్నామని వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా జగన్ ప్రభుత్వం పరిపాలన చేసిందని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశానికి ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు.
Discussion about this post