మిలన్-2024 వేడుకలు : విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించనున్న మిలాన్-2024 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ డీసీపీ మణికంఠ తెలిపారు. కవాతులో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. బీచ్ రోడ్డును దిగ్బంధిస్తామని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి పూర్తిస్థాయి రిహార్సల్స్ నిర్వహిస్తామని, పరేడ్ లో 50కి పైగా దేశాలకు చెందిన వీఐపీలు పాల్గొంటారని తెలిపారు.
Discussion about this post