తమ వద్ద అప్పులు తీసుకుని తిరిగి తీర్చకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్దుడిని బాధితులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్ణణానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్ కి పట్టణానికి చెందిన కొంతమంది అప్పులు ఇచ్చారు. కొన్నేళ్లుగా వాటిని తీర్చకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తండ్రి ఆదివారం మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసం వచ్చిన అతడిని పట్టుకుని తమ అప్పుల మాటేమిటని నిలదీశారు. చివరకు శ్రీకాంత్ అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చాక అంత్యక్రియలకు అనుమతించారు.
Discussion about this post