మాయ మాటల కాంగ్రెస్ కూటమికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని బీజేపి ఎంపి అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఘనపూర్, జాఫర్ ఘడ్, ధర్మసాగర్, చిల్పూరు మండలాల బిజేపి కార్యకర్తలతో విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపి పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ పాల్గొని మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలని అన్నారు. మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ప్రపంచమే భారత్ వైపు చూసేలా చేస్తున్న ఘనత నరేంద్రమోడీదని అన్నారు.
Discussion about this post