మరో 48 గంటల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండడంతో… పార్టీల అభ్యర్ధుల ప్రచారాలు జోరందుకున్నాయి. హనుమకొండ జిల్లా హసన్ పర్తి గ్రామంలో బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చెయ్యడానికే అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. కడియం శ్రీహరి దళిత ద్రోహి అని, అతనికి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. వరంగల్ పార్లమెంటులో బీజేపి జెండా ఎగరడం ఖాయం అంటున్న బీజేపి ఎంపీ అభ్యర్థి రమేష్
Discussion about this post