ధర్మశాలలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టు వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌కి 100వ టెస్టు మ్యాచ్. ఇదే టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్‌గానూ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
భారత్ తరపున 99 టెస్టు మ్యాచ్‌లు ఆడి 507 వికెట్లు తీసిన అశ్విన్.. 100 టెస్టు మ్యాచ్ ఆడబోయే 14వ భారత ఆటగాడు. ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రాజ్‌కోట్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో 500 టెస్టు వికెట్లు పూర్తి చేసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు తన కెరీర్లో 100వ మ్యాచ్ ఆడి సరికొత్త రికార్డును లిఖించనున్నాడు. రాంచీ టెస్టులో భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.
Discussion about this post