సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ 8వ వార్డు కౌన్సిలర్ చాంద్ పాషాపై కొందరు యువకులు దాడి చేశారు. సత్తుపల్లిలోని తన మెకానిక్ షాపు నుండి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వేంసూరు రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొందరు యువకులు ఆయన వాహనానికి వారి వాహనాన్ని అడ్డుపెట్టి దాడి చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ ఎస్ నాయకులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితుడిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Discussion about this post