యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ధి దారి తప్పి మనవరాళ్ల వయసున్న బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఓ బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఆ టీచర్ అఘాయిత్యం బయటపడింది. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి ఏడాది కాలంగా 3వ తరగతి చదువుతున్న ఆరుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. పిల్లలకు చాక్లెట్స్, పైసలు ఆశ చూపి పిల్లల లోదుస్తులు విప్పి ఒళ్లంతా తడుముతున్నాడని, ముద్దులు పెడుతున్నాడని, విషయం ఎవరికి చెప్పవద్దని కొట్టి భయపెట్టే వాడని, దీంతో పిల్లలు తమకు చెప్పలేదని తల్లిదండ్రులు తెలిపారు. బాధిత పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
Discussion about this post