బీఆర్ఎస్ లో పోటీ అంటేనే నేతలు భయపడి పోతున్నారని… ఆర్ధిక బలం ఉన్న రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డిలు కూడా వెనకడుగు వేస్తున్నారని హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్న సైదిరెడ్డి తన అనుచరులతో మాట్లాడిన ఓ ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ నుంచి హఠాత్తుగా బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.. నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే కండువా కప్పుకున్నా. మీకు తెలియకుండా పార్టీ మారినందుకు క్షమించండి… మీరంతా నన్ను నమ్ముకుని పనిచేయండని టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తన అనుచరులను సైదిరెడ్డి మాట్లాడారు.. రెండు రోజుల్లో మిమ్మల్ని కలుస్తానని … భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో మోడీ గాలి వీస్తుంది…10 నుంచి 12 ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందన్నారు.






















Discussion about this post