అగనంపూడి జాతీయ రహదారిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. మల్కాపురం ప్రకాశ్ నగర్ ప్రాంతానికి చెందిన దాడి సూర్యకిరణ్‌ను గంగవరంకు చెందిన కోర్లయ్య కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖ మల్కాపురం ప్రాంతానికి చెందిన సూర్యకిరణ్, గంగవరంకు చెందిన మేఘన సంవత్సరం క్రితం ప్రేమ విహహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. వివాహం అనంతరం భార్యభర్తలు ఇద్దరూ హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. మేఘన గర్భవతి కావడంతో విశాఖ అగనంపూడి ఆస్పత్రిలో భర్త సూర్యకిరణ్ చేర్పించాడు. యువతికి పాప పుట్టడంతో చూసేందుకు ఆమె తల్లి సుజాత వచ్చారు.
తమ ప్రేమ వివాహాన్ని నిరాకరించిన కారణంగా పాపను చూసేందుకు సూర్యకిరణ్ అనుమతించలేదు. తనకు అవమానం జరిగిందంటూ యువతి తల్లి గంగవరంలోని తమ బంధువు కొర్లయ్యకు సమాచారం ఇచ్చింది. సూర్యకిరణ్ భార్య, బిడ్డను చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో అగనంపూడి జాతీయ రహదారిపై కాపు కాసిన కోర్లయ్య బైక్‌తో ఢీకొట్టాడు. అనంతరం కిందపడిపోయిన యువకుడిని విచక్షణా రహింతగా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన స్థానికులు బాధితుణ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సూర్యకిరణ్ మృతిచెందాడు. దాడి అనంతరం దువ్వాడ పోలీస్ స్టేషన్లో నిందితుడు కొర్లయ్య లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Discussion about this post