మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం: అయోధ్యలోని విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ వాల్మీకి సంఘం కృతజ్ఞతా యాత్ర నిర్వహించింది. తూర్పు కమాన్ నుంచి పాలమూరు పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
శోభా యాత్ర సందర్భంగా డీకే అరుణ, మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి పేరు పెట్టడం గొప్ప విషయమని చెప్పారు. ప్రధాని మోదీకి వాల్మీకులతోపాటు తాము కూడా ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రతిష్ట విశిష్టతను వివరించారు.
Discussion about this post