పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ ఈ రికార్డును సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.
గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 13 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు.
Discussion about this post