రాష్ట్రంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇంటివద్దే సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు అండ్ కో విషంచిమ్మడం తగదని, కోవిడ్ మహమ్మారి సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని రాష్ట్ర మంత్రి సీధిరి అప్పలరాజు అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్లును చైల్డ్ ట్రాఫికింగ్,ఉమెన్ ట్రిఫికింగ్ చేస్తున్నారని చులకనగా మాట్లాడారని, చంద్రబాబు నాయుడు వాలంటీర్లను మూటలు మోసే వారని, తలుపులు తట్టి మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారని చెప్పారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిందేమి లేదని, అలాంటి బాబుకు అధికారం దేనికని ప్రశ్నించారు..
Discussion about this post