తెలంగాణ ప్రజాశాంతి అధ్యక్షుడిగా కేఏపాల్ తనను నియమించడంపై బాబూ మోహన్ స్పందించారు. ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి వన్నె తెస్తానని, ప్రతి బై ఎలక్షన్ లోనూ విజయం సాధించానన్నారు. ఏ పార్టీలో ఉన్నా గెలిచానన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాశాంతి పార్టీ విజయానికి కృషిచేస్తానన్నారు.
వరంగల్ నుంచి ఎంపీగా పోటీచేస్తున్నానన్నారు. ఇప్పుడున్న పార్టీలన్ని దోచుకున్న పార్టీ లే అని బాబూ మోహన్ విమర్శించారు. కేఏపాల్ కు అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల అధ్యక్షులతో మంచి సంబంధాలున్నాయన్నారు. విదేశాల నుంచి రూ. 6 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చి దేశాభివృద్దికి పాటుపడతారన్నారు.
Discussion about this post