ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులోనూ ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 29వ తేదీ తర్వాత ప్రారంభమయ్యే వారంలో ఆయన పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ ప్రతిస్పందన కోరుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నోటీసులు జారీ చేశా రు. వీటికి ఈనెల 24లోపు జవాబివ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. న్యాయస్థానం దిగ్భ్రమకు గురయ్యే కొన్ని వాస్తవాలను వెల్లడించాలనుకుంటున్నట్లు తెలిపారు.
Discussion about this post