చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు పై నడకని ఎగ్జిట్ పోల్స్ తెలపినా, అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రం లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బీజేపీ 54 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండగా, కాంగ్రెస్ 35 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. 2018లో 68 సీట్లు గెలుచుకుని 15 ఏళ్ల తర్వాత బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ చత్తీస్ ఘడ్ లో ఓడిపోవడానికి ముఖ్య కారణం భూపేష్ బఘేల్ కు మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా ప్రమోటర్లు రూ 508 కోట్లు లబ్ది చేకూర్చారన్న ఆరోపణలను ప్రజలు నమ్మడమే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ లకు చట్టబద్దత కల్పించకపోవడంతో వారికి రిజర్వేషన్లు అమలు చేయలేకపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంచాయతీ నుంచి పార్ల మెంటు వరకు ఓబీసీలు నష్టపోయారని మోడీ ఎన్నికల సభల్లో ప్రచారం చేయడం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి కారణమైంది.భూపేష్ బఘేల్ ఆధీనం లోని కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందన్న తీవ్రస్థాయి విమర్శలు, జల్ -జంగిల్ -జమీల్ పై హక్కుల కోసం ఆదీవాసీలు ఎప్పటి నుంచో పోరాడుతున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకు పోవడం కూడా చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పతనానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.చత్తీస్ ఘడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాంగ్రెస్ నేతల పిల్లలు, వారి బంధు, మిత్రులకు ఉద్యోగాలు ఇచ్చారని.. పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్ సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను సీఎం భగేల్ ఇతర ఖర్చులకు వినియోగించుకున్నారని బీజేపీ దుమ్మెత్తి పోసింది. మద్యం, గోపేడ, పేదలకు ఇచ్చే రేషన్లు, ఇంకా ప్రధాన మంత్రి పథకమైన గరీబ్ కల్యాణ్ లో అవినీతి జరిగిందని మోడీ విమర్శించారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమవడంతో చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ఓటమి చెందింది.
Discussion about this post