లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాదులో నిర్వహించిన రోడ్ షోతో ఆ పార్టీకి మరింత బలం చేకూరిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఒకవైపు బీజేపి, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు.
Discussion about this post