మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్… టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుందని చెప్పింది. మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. సైబర్ క్రైమ్స్‌ను అడ్డుకోవాలనే టార్గెట్‌గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, 28,200 మొబైల్ హ్యాండ్ సెట్స్.. సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యాయని తెలిపింది. ఈ మొబైల్ హ్యాండ్ సెట్స్‌లో దాదాపు 20 లక్షల నెంబర్లను వినియోగించారని చెప్పింది. రీవెరిఫికేషన్ అనంతరం ఈ సిమ్ కార్డులు అన్నింటిపై నిషేధం అమల్లోకి వస్తుందని, ఫోన్లపై కూడా బ్యాన్ పడనుందని తెలిపింది.
Discussion about this post