టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచ్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. ఆయుష్మాన్ భవ ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఆకస్మాతుగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతోపాటు బీపీ పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒకట్రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఈ ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయాలని బండారు భావించారు. కానీ కూటమిలో భాగంగా జనసేనకు టికెట్ పోయింది. పంచకర్ల రమేష్ బాబుకు ఈ సీటును కేటాయించారు. దీంతో సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది.
Discussion about this post