రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 ను అమలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బంద్ చేపట్టారు. గిరిజన సంఘాలు పిలుపుమేరకు ఆదివారం చింతపల్లిలో ఆదివాసీ సంఘాలు బంద్ చేపట్టాయి. మన్యం ప్రాంతంలో జీవిస్తున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై వారు మండి పడ్డారు. బంద్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
Discussion about this post