కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం లింగాపుర్ గ్రామంలో బండి సంజయ్ కల్లు తాగారు. అనంతరం కల్లు గీత కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కల్లు గీత కార్మికుడి తో ముచ్చటిస్తూ.. ఎంతమంది కల్లు గీత కార్మికులు ఉన్నారు! ఎంత కల్లు అవుతుంది? ఆదాయం ఎంత ? అంటూ గీత కార్మికులతో ముచ్చటించారు.
తాటి కల్లును తాగిన బండి సంజయ్ కార్మికులతో ఆర్థిక, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సరదాగా గౌడన్న మోకు వేసుకొని గౌడన్నలను ఉత్సాహపర్చిన సంజయ్…కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వెల్లడించారు. ఆరోగ్య నిపుణులు సైతం ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. వైన్స్, బార్లు పెట్టీ కేసీఆర్ గౌడన్నల పొట్ట కొట్టాడని ఫైర్ అయ్యారు. 73 ఏళ్ల వయసుపై బడిన గౌడన్నలు ఇప్పటికీ కల్లు గీసి పోస్తున్నారని కొనియాడారు.
Discussion about this post