ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. వారిలో రజత్ పటీదార్ మినహా.. మిగతా అందరూ సత్తా చాటారు. యువకులకు జట్టులో స్థానం కల్పించడం వెనక కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రోద్బలమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో సీనియర్లు లేకపోయినా జట్టును నడిపించేందుకు యువకులకు అనుభవం వస్తుందనే ఉద్దేశంతో అగర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం…
వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌ను ఈ సిరీస్ మొత్తం ఆడించాలని రోహిత్-రాహుల్ ద్రవిడ్ ద్వయం భావించింది. తొలి రెండు టెస్టుల్లో భరత్ ఆకట్టుకోలేకపోవడంతో, అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అగార్కర్ సూచించాడని తెలుస్తోంది. అగార్కర్ నిర్ణయం పట్ల జట్టు మేనేజ్మెంట్ నమ్మకం ఉంచలేదని, సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం లేని క్రికెటర్‌ను ఎంపిక చేయడం సరైంది కాదనే అభిప్రాయం కెప్టెన్‌తోపాటు కోచ్‌లోనూ ఉందని తెలిసింది. ఇంగ్లాండ్ వంటి కఠినమైన ప్రత్యర్థితో ఆడేటప్పుడు కొత్త ఆటగాడు కాకుండా అనుభవం ఉన్న క్రికెటర్‌ను బరిలోకి దింపితే బాగుంటుందనేది వారి అభిప్రాయం. అగార్కర్ మాత్రం యువ క్రికెటర్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పడంతో ధ్రువ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం అని బీసీసీఐ వెల్లడించింది.
Discussion about this post