వలస పక్షులు ఇచ్చే భారీ ప్యాకేజిలతో పార్టీలు అమ్ముడై పోయి అనకాపల్లి నియోజకవర్గ నాయకులకు మొండిచేయి చూపిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొద్దిరోజుల్లో జరగబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం – బిజెపి-జనసేన పోత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తుల్లో భాగంగా జిల్లాలో జనసేనకు అనకాపల్లి కొణతాల రామకృష్ణ, యలమంచిలి సుందరపు విజయకుమార్, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు అసెంబ్లీ సీట్లను కేటాయించారు.
తెలుగుదేశం పార్టీకి నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, చోడవరం కె.ఎస్.ఎన్. రాజు మాడుగుల పైలా ప్రసాదరావు నియోజకవర్గాలను కేటాయించారు. అయితే రాష్ట్రంలో ఒక్క శాతం కూడ ఓటు లేని బీజేపీతో పొత్తుపెట్టుకుని 2014 ఎన్నికల విజయాన్ని రిపిట్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లిన విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలిసిందే.. అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలను నమ్ముకొని ఏళ్ల తరబడి కష్టపడిన నాయకులను ఇరు పార్టీలు మోసం చేసి నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడంపై ఇప్పటికే పెద్ద రచ్చ జరుగుతోంది.
అ రచ్చ చల్లారకముందే పోత్తులో బాగంగా అనకాపల్లి ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించారు. ఈ టికెట్ కోసం బీజేపీలోని కార్పొరేట్ వ్యాపార రాజకీయ నాయకులు తెగపోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఆపార్టీలో ఉన్న జీవిఎల్, ఆర్థిక నేరాల్లో కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్లిన సృజన చౌదరి, సీఎం రమేష్, జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, సంఘసేవకులు ముత్యాల వెంకటేశ్వరావు ఎంవీఆర్ పేర్లు నిన్నటి వరకు ప్రముఖంగా వినిపించాయి.
Discussion about this post