శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్ల తీర్పు ఇప్పటికే ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. విజేతలు ఎవరనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే…ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న పది నియోజకవర్గాల్లో కలిపి 78.21 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి దాదాపు 2.28 శాతం అదనంగా ఓటింగ్ జరిగింది. రిజల్ట్ రావడానికి ఇంకా ఇరవై రోజులు ఉండగా…జిల్లా వ్యాప్తంగా అభ్యర్ధుల గెలుపు ఓటములపై, మెజారిటీపై లక్షలాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. శాసనసభ స్పీకర్, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలతో పాటు ఎచ్చెర్ల, టెక్కలి, నరసన్నపేట నియోజక వర్గాల్లో వైసీపి, టీడీపి శ్రేణులు మధ్యవర్తుల ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Discussion about this post