భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలియడంతో భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. వెంకట్రావు రాకను అంతర్గతంగా ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై … తెల్లం వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. భద్రాచలం అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధం అంటున్న వెంకట్రావ్… చొక్కాలు మార్చినట్టు పార్టీలను మారుస్తున్నాడని అన్నారు. స్వలాభాల కోసం పార్టీలు మారే వెంకట్రావ్ కు… పొదెం వీరయ్యను విమర్శించే స్థాయి, అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post