జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఘనాదిత్యా, అనిరుధ్ మృతి చెందడంతో ప్రభుత్వం స్పందించింది. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 15 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు చెత్తాచెదారం, పురాతన షెడ్స్ ఉండడంతో వాటిని తొలగించి పరిస్థితులను మెరుగుపరిచేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డార్మెంటరీ, పై అంతస్తు కోసం ప్రతిపాదనలు వెంటనే పంపిస్తే ఆలస్యం లేకుండా నిధులు మంజూరు చేస్తామని, నిధులకు ఇబ్బంది లేదన్నారు.
Discussion about this post