సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్‌తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ.. ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలవ్వగా…. మంగ్లీకి చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడింది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగించుకుని అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా గుద్దింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు.
Discussion about this post