ఖమ్మంలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ.. పలువురు నాయకులు రాజీనామా బాట పట్టారు. సీనియర్ నాయకుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ నేతృత్వంలో ఆయన మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీని వీడింది. వీరిలో కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, మాదిగ, మాల, క్రిస్టియన్, ముస్లిం తదితర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఉద్యమ పార్టీగా ప్రజలకు పరిచయం ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కారణంగా పార్టీ ఉద్యమ స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నారు. పార్టీని వీడటానికి కారణాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. తామంతా కలిసి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరమ్ గా ఏర్పడుతున్నట్టు వెల్లడించారు.
Discussion about this post