లోక్ సభ ఎన్నికల వేళ బీహార్ మాజీ సీఎం , RJD చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కి భారీ షాక్ తగిలింది . ముప్ఫయ్ యేళ్ళనాటి అక్రమ ఆయుధాల కొనుగోలు కేసు లో ఆయనకు గ్వాలియర్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . ఇప్పటికే దాణా కుంభకోణం కేసు లో బెయిల్ పై ఉన్న ఆయనకు మరోసారి అరెస్ట్ గండం పొంచి వుంది . కాగా 1995 -97 మధ్య నిబంధనలకు విరుద్ధం గా ఆయుధాల కొనుగోలు కేసు లో లాలూకి సంబంధం పై ఆధారాలు ఉన్నట్టు పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క లాలూ ప్రసాద్ యాదవ్.. రబ్రీ దేవిల పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తేజ్ ప్రతాప్ ప్రస్తుతం హసన్పూర్ ఎమ్మెల్యే. బీహార్ మహాకూటమిలో నితీష్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. ఈయన బీజేపీ లో చేరిక .. తండ్రి లాలూ అరెస్ట్ కాకుండా ఆపగలుగుతుందా లేదా చట్టం తనపని తాను చేసుకు పోతుందా వేచి చూడాలి.
Discussion about this post