పార్లమెంట్ ఎన్నికల వేళ టీ-బీజేపీకి జితేందర్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. బీజేపీ హై కమాండ్ తీరుపై తీవ్ర అసంతప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలో వరస చేరికలతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీకి.. జితేందర్ రెడ్డి రివర్స్ షాక్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ టికెట్ ఆశించగా… హైకమాండ్ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణకు కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి గురి అయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనించగా.. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల్లోనే కీలక పోస్ట్ వరించింది. న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. న్యూఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి ఇటీవలే మల్లు రవి రాజీనామా చేయగా…ఖాళీగా ఉన్న ఈ పోస్ట్‌ను జితేందర్ రెడ్డికి కేటాయించారు. దీంతో పాటు క్యాబినేట్ ర్యాంక్‌తో తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహరాల సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Discussion about this post