బిగ్ బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ కు స్వగ్రామం కొల్గుర్ లో ఘన స్వాగతం లభించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గుర్ గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 లో అద్భుతంగా ఆడి విజేతగా నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వందలాదిమంది అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొల్గుర్ వరకు ర్యాలీ కొనసాగింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ ట్రోఫీతో అభివాదాలు తెలుపుతూ పాల్గొన్నారు. ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం చాలా సంతోషంగా ఉందని అభిమానులు చెప్పారు.
Discussion about this post