బిహార్లో కులగణన సర్వే నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు , అత్యంత వెనుకబడిన తరగతులు కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ రిపోర్టును రాష్ట్ర డెవలప్మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బిహార్ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లుగా ఉంది. హిందువులు 81 శాతం, ముస్లింలు 17 శాతం ఉన్నారు.క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కులు 14753, బౌద్ధులు 1,11,201, జైనులు 12,523 మంది ఉన్నారు.అయితే ఈ కుల గణన కొన్ని పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారనుంది .దీని ఆధారంగా తమ పావులను కదిపేందుకు నాయకులూ సిద్ధం అవుతున్నారు .
బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన కులగణన నివేదిక ప్రకారం ఇతర వెనుకబడిన తరగతులు , అత్యంత వెనుకబడిన తరగతులు కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉంది .తాజా నివేదిక ప్రకారం బిహార్ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లుగా ఉంది. హిందువులు 81 శాతం, ముస్లింలు 17 శాతం ఉన్నారు.క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కులు 14753, బౌద్ధులు 1,11,201, జైనులు 12,523 మంది ఉన్నారు. హిందువులు 10,71,92,958 మంది ఉన్నారు. ముస్లింల సంఖ్య 2,31,49,925గా ఉంది.వీరు రాష్ట్ర జనాభాలో దాదాపు 17 శాతం మంది ఉన్నారు. ముస్లింలతో పోలిస్తే హిందువుల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ. క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కులు 14753, బౌద్ధులు 1,11,201, జైనులు 12,523 మంది ఉన్నారు.అలాగే జనాభాలో అత్యంత వెనుబడిన తరగతుల వారు 36 శాతం ఉండగా ఇతర వెనుకబడిన తరగతుల వారు 27.13 శాతం ఉన్నారు. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక ద్వారా తెలుస్తుంది . మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది . షెడ్యూల్డ్ కులాల జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్ తెగల జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు తేలింది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పగా తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ గత ఏడాది జూన్లో ప్రకటించారు. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో జనవరిలో ప్రారంభం అయిన కులాలవారీ జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యింది . కులగణను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాక న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.
ఇటీవలి వారాల్లో భారత కూటమితో తన సంబంధాలు దెబ్బతినడంతో, నితీష్ కుమార్ ప్రతిపక్ష కూటమికి కొంత దూరంగా కనిపించారు. సోమవారం, బీహార్ ముఖ్యమంత్రి రాష్ట్ర కులాల సర్వే డేటాను విడుదల చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో మరోసారి కేంద్రంగా నిలిచారు.రాష్ట్రంలో కుల గణన సర్వే వివరాలు వెల్లడించిన తరువాత సీఎం నితీశ్ కుమార్ అఖిల పక్ష భేటికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 9 ప్రధాన పార్టీలు భేటీకి హాజరుకావాలని ఆయన కోరారు. ఈ మీటింగ్ లో కుల గణన నివేదికపై చర్చించనున్నారు. ప్రజల ఆర్థిక స్థితి గతులు, కులాల వారిగా సంక్షేమం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సందర్భంగా నితీశ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికలకు ముందు బిహార్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ నెరవేరింది అని అయన అన్నారు .
తాజా కుల గణన నివేదికపై ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ స్పందించారు. ఇది చరిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం కుల సర్వేలు విడుదల చేసిందని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలను ఇరకాటంలో పడేసే అవకాశాలు వచ్చినప్పుడు.. వాటిని బాగా ఉపయోగించుకునే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎంతో చురుగ్గా రాజకీయ వ్యూహాలను రచిస్తూ.. బీజేపీకి సరైన సమయంలో సరైన రీతిలో కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు బిహార్లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం కులాల సర్వే వివరాలను విడుదల చేసిన నేపథ్యంలో.. రాహుల్ గాంధీ ఓ కీలక ప్రకటన చేశారు. జనాభా లెక్కల్ని బట్టి తాము హక్కులు అందిస్తామని, ఇది తన ప్రతిజ్ఞ అని హామీ ఇచ్చారు.
సోమవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘బిహార్లో నిర్వహించిన కుల గణన ప్రకారం.. ఆ రాష్ట్రంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి మొత్తం 84% మంది ఉన్నట్టు తేలింది. అయితే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 మంది కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందినవారు. వీళ్లు భారతదేశ బడ్జెట్లో 5% మాత్రమే నిర్వహిస్తున్నారు. అందుకే, భారతదేశంలోని కుల గణాంకాలకు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నేను ప్రమాణం చేస్తున్నాను.. దేశంలో ఎంత జనాభా ఉంటే, అందుకు తగ్గట్టే మేము ఎక్కువ హక్కులు కల్పిస్తాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. తాము బీజేపీ నేతల తరహాలో కల్లిబొల్లి మాటలు చెప్పమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు.
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, “ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, మేము ప్రభుత్వంలో భాగంగానే ఉన్నాం . నిజానికి ఇది మా బేబీ . దీనికి విరుద్ధంగా, మహిళా రిజర్వేషన్ బిల్లులో, RJD చారిత్రక పాత్ర ఏమిటో అందరికీ తెలుసు.అని అన్నారు .
Discussion about this post