ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠను కలిగించడమే కాకుండా ఊహించని ఫలితాలను అందించాయి.ఒడిశాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సంచలనాన్ని కలిగించాయి .బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ తాను పోటీ చేసిన కాంటాబంజీ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయి 24 ఏళ్ల ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవడమే కాకుండా బీజేపీ కి చెందిన ఒక నామ మాత్రపు నాయకుడి చేతిలో పరాజయం మూటకట్టుకున్నాడు. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
పట్నాయక్ తన కంచుకోట అయిన హింజిలితో పాటు పోటీ చేసిన రెండవ స్థానం కాంటాబంజీలో బీజేపీకి చెందిన లక్ష్మణ్ బాగ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు . ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలిచిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సలూజా కేవలం 26,839 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంటాబంజీలో బీజేపీ విజయం సాధించడం ఇదే తొలిసారి.
2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో లక్ష్మణ్ బాగ్ అదే స్థానం నుండి మూడవ స్థానంలో నిలిచాడు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ సింగ్ సలుజా చేతిలో కేవలం 128 ఓట్ల తేడాతో ఓడిపోయారు.48 ఏళ్ల బాగ్ మాట్లాడుతూ, ఈసారి కూడా తాను గెలుస్తానని ఊహించలేదన్నాడు. ఓటర్లు ఎన్నికలయ్యే దాకా సైలెంట్ గా ఉండి తెలివిగా వోటువేశారని చెప్పడం గమనించదగిన అంశం.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ .. తెలంగాణలోని ఇటుక బట్టీలకు వలసల సుదీర్ఘ చరిత్ర కలిగిన నియోజకవర్గంలో బలమైన మూలాలను కలిగి ఉన్న బాగ్ , వలస కార్మికులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు సహాయం చేయడం ద్వారా తన స్థానాన్ని బలపరుచుకున్నాడని అతని సన్నిహిత వర్గాలంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా బిజెపి కి వేవ్ రావడం తో పాటు , దాదాపు 40,000 జనాభా ఉన్న ప్రాంతంలో ఆధిపత్యంలో ఉన్న యాదవ్ కమ్యూనిటీ అతనికి అనుకూలంగా పనిచేసినట్లు కనిపిస్తోంది.
బాగ్ సాధించిన విజయాన్నిఅతని సహాయకుడు వివరించాడు. “బాగ్ కి 2014 ఎన్నికలలో పోటీ చేసే ముందు నాటికి ఎలాంటి ఎన్నికల రాజకీయాల అనుభవం లేదు. అతనికి కుటుంబ నేపథ్యం కూడా లేదు. బాగ్ నియోజకవర్గంలో సామాజిక సేవ చేసేవాడు. VHP .. బజరంగ్ దళ్‌తో సంబంధాలు ఉండేవి అని సన్నిహిత సహాయకుడు చెప్పాడు.
Discussion about this post