భారత్ లో ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం.. 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు. 2023లో ఆయన సంపద 83.4 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో రెండో సంపన్నుడైన గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 47.2 బిలియన్ డాలర్ల నుంచి 84 బిలియన్ డాలర్లకు పెరిగింది.
హెచ్‌సీఎల్ టెక్ సహవ్యవస్థాపకుడు శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్-కుటుంబం 33.5 బి.డాలర్లతో 46వ స్థానంలో, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి 26.7 బి.డాలర్లతో 69వ స్థానంలో నిలిచారు. సైరస్ పూనావాలా 21.3 బి.డాలర్లతో 90వ స్థానం, కుషాల్ పాల్ సింగ్ 20.9 బి.డాలర్లతో 92వ స్థానంలో, కుమార్ బిర్లా 19.7 బి.డాలర్లు, 98వ స్థానం దక్కించుకున్నారు.
తెలుగువారి విషయానికి వస్తే .. ఫార్మాస్యుటికల్స్ కు చెందిన మురళి దివి, కుటుంబం 6.2 బిలియన్ డాలర్ల సంపదతో అంటే రూ.51వేలకోట్లతో 469 ర్యాంకులో, అపోలో ఆసుపత్రి స్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి 3 బిలియన్ డాలర్లతో అనగా రూ.26వేలకోట్లతో 1104 ర్యాంకు, జీఎం రావు 2.9 బిలియన్, డాలర్లతో అంటే రూ.25 వేలకోట్లతో 1143 ర్యాంకు, పీవీ రామ్ ప్రసాద్‌రెడ్డి 2.9 బిలియన్ డాలర్లతో అంటే రూ.25వేలకోట్లుతో 1143 ర్యాంకుల్లో ఉన్నారు. జూపల్లి రామేశ్వర్రావు 2.3 బిలియన్ డాలర్లతోఅనగా రూ.19వేలకోట్లతో 1438 ర్యాంకు
పీపీ రెడ్డి 2.3 బిలియన్ డాలర్లతో అనగా, రూ.19వేలకోట్లుతో 1438 ర్యాంకు
పీవీ కృష్ణారెడ్డి 2.2 బిలియన్ డాలర్లతో అంటే రూ.18వేలకోట్లు 1496 ర్యాంకు
ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్ డాలర్లతో రూ.16వేలకోట్లతో 1623 ర్యాంకు
కె.సతీశ్‌రెడ్డి 1.8 బిలియన్ డాలర్లతో అంటే రూ.15వేలకోట్లు 1764 ర్యాంకు,
జి.వి.ప్రసాద్ 1.5 బిలియన్ డాలర్లతో అనగా రూ.12వేలకోట్లు 2046 ర్యాంకులో ఉన్నారు.
Discussion about this post