రైతుల వరి పంటకు సంబంధించి ఏ సీజన్ వచ్చినా చాలు … అక్కడ ఆ అధికారిపై ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇన్ని విమర్శలు వస్తున్న ఆ అధికారి పై ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై రైతులు ప్రతిసారి నెత్తి నోరూ కొట్టుకుంటున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. ఆ రైతుల సమస్యలేమిటో ? అధికారులు ఏమంటున్నారో ? ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం .
కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం భరేంగేడ్గి బీర్కూర్ గ్రామ రైతులు మండలంలోని సిద్ది వినాయక ఇండస్ట్రీస్ లో వరి ధాన్యం కొలతలు తక్కువగా రావడంతో సొసైటీ సెక్రటరీ విట్టల్ పై రైతులు వాగ్యుద్ధానికి దిగారు. రైతులకు ప్రతి సీజన్లో ఇలాగే కొలతలు తక్కువగా వచ్చి నష్టపోతుంటారు తూనిక వేయడం లో అవకతవకలు జరుగుతున్నాయి .. రైస్ మిల్లర్లుతో, సొసైటీ సీఈఓ చేతులు కలిపి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ఏదో రకంగా ఒకవైపు నష్టం జరుగుతుండగా మరోవైపు దళారులతో అధికారులు చేతులు కలపడంతో . రైతులకు మరింత నష్టం జరుగుతుంది. ఇందులో భాగంగా మండలంలోని ఒక రైతు నుండి 90 క్వింటాళ్ల ధాన్యాన్ని సొసైటీ సిబ్బంది పీపీసీ ద్వారా తూకం వేసి బీర్కూరు రైసెమిల్ కు పంపగా … అక్కడ 5 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా రావడంతో.. రైతులు తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించారు.
జరుగుతున్న అవకతవకలపై తహసీల్దారు సదరు రైస్‌మిల్లు వెయింగ్ మిషన్ తూకం కొలతలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.ఈ అంశంపై సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సదరు రైస్‌మిల్లు వేయింగ్ మిషన్ తూకంపై విచారణ చేయగా అసలు కథ బయటపడింది. సొసైటీ పిపిసిల లోనే పొరపాటు జరిగిందని ఆ సొసైటీ అధికారి, ఉన్నత అధికారులకు వివరణ ఇచ్చారు.
యాసంగి వానాకాలం కొనుగోలుకు సంబంధించి ఎప్పుడు ఆ అధికారితో రైతులకు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. అయినా ఉన్నతాధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బీర్కూర్ మండల రైతుల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతుకు జరిగిన నష్టం పై ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆ అధికారి పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Discussion about this post