ఆర్టికల్ 370 రద్దు చేసిన స్పూర్తితో దేశ వ్యాప్తంగా బీజేపీ సొంతంగానే 370 సీట్లు గెలుస్తామని చెబుతుంది. అయితే ఎక్కడైతే ఆర్టికల్ 370 రద్దయిందో… ఆ ప్రాంతంలో బీజేపీ కనీసం పోటీ కూడా చేయడం లేదు. తాను ప్రచార అస్త్రంగా ఎంచుకున్న ఆర్టికల్ 370 రద్దు అంశం దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎంతమేర ఓట్లు కురిపిస్తుందో కానీ కశ్మీర్ లోని మూడు లోక్ సభ నియోజక వర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించక పోవడం మాత్రం చర్చకు దారితీస్తుంది. ఇంతకీ కశ్మీర్ లో బీజేపీ పోటీ చేయక పోవడానికి గల కారణం ఏమిటి?
ప్రతీ ఎన్నికల్లోనూ సాధారణంగా రాజకీయ పార్టీలు ఒక అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో వాడుతుంటాయి. అది కూడా ఒక్క లైన్ లో చెప్పగలిగే విధంగా… ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా చూస్తాయి. ఆ కోవలోకి వచ్చేదే ప్రధాని మోదీ ఎంచుకున్న ‘ఇస్ బార్… చార్ సౌ పార్…’. నినాదం.
( మోదీ బైట్ వాడుకోవాలి. ‘ఇస్ బార్… చార్ సౌ పార్…’)
ప్రధాని మోదీ ఇచ్చిన ఈ నినాదాన్ని బీజేపీ శ్రేణులు 2024 ఎన్నికల్లో చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. మిత్ర పక్షాలతో కలిసి 400లకు పైగా సీట్లు గెలుస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ 400 సీట్లు ఎందుకనే విషయంలో బీజేపీ సోషల్ మీడియా మొదట్లో ఒక ప్రచారం కూడా చేసింది. ఆర్టికల్ 370 కంటే భయంకరమైన చట్టం … వక్ఫ్ బోర్డు రద్దు చేయాలంటే 407 సీట్లు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసింది.
అయితే బీజేపీ సోషల్ మీడియా సాగించిన 407 సీట్ల ప్రచారం కొన్ని రోజులే సాగింది. కానీ ప్రచారం మొదలు పెట్టినప్పుడు బీజేపీ తీసుకున్న నినాదం… సొంతంగా 370 సీట్లు సాధించాలని. అదే విధంగా దేశ వ్యాప్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో 370 ఓట్లు అదనంగా రాబట్టాలని ప్రచారం చేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. దేశ వ్యాప్తంగా తమ నినాదానికి పనికొస్తున్న ఆర్టికల్ 370 అంశం బీజేపీకి దాని ప్రభావం చూపే కాశ్మీర్ లో మాత్రం అంటరానిదిగా తయారైంది. ముచ్చటగా మూడో సారి అధికారానికి వస్తామని ధీమాగా చెబుతున్న బీజేపీ నాయకత్వం కాశ్మీర్ లోని మూడు స్థానాల్లో పోటీ చేయడం లేదంటే ఆశ్చర్యం వేయడం లేదా? కానీ ఇది నిజం. కాశ్మీర్ లో అనంతనాగ్ – రాజౌరి, బారాముల్లా, శ్రీనగర్ లోక్ సభ స్థానాలున్నాయి. వీటిలో గెలుపు కాదు కదా…? కనీసం గౌరవపదమైన ఓట్లు కూడా రావని భావిస్తున్న బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.
Discussion about this post