ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దని చెప్పిన వైసీపీ నేతలు కొత్త మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరో మంత్రి బొత్స తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ ప్రభుత్వ అసమర్థత కనిపిస్తుందని చెప్పారు.
Discussion about this post