బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మాట్లాడితే హాట్ టాపిక్… ట్వీట్ చేస్తే అదో సంచలనం. ఇప్పటిదాకా సినిమాల గురించి చర్చలు నడిచేవి. కానీ ఇప్పుడు అంతకు మించి పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇంతకి ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకుంటారా… అయితే మీరే చూడండీ కారణమేంటో.
కంగనా రనౌత్.. ఈ ముద్దుగుమ్మ సినిమాల గురించి దేశమంతా ఎంతమందికి తెలుసో తెలియదు కానీ బ్యూటీ చేసే కామెంట్లు, చేసే కాంట్రవర్సీలు మాత్రం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే రామ్‌గోపాల్ వర్మను మించి కంగనా.. అన్ని విషయాల్లో కలగజేసుకుంటోందిప్పుడు. పైగా డొంక తిరుగుడు లేకుండా.. ఏవిషయాన్నైనా స్ట్రెయిట్‌గా చెప్పడం ఈ క్యూటీకే చెల్లింది. ఎప్పుడు వివాదాలను కొని తెచ్చుకొనే పనిలో ఉండే ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొట్టడం వైరల్ గా మారింది.
కంగనా కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడిపింది. అయితే తన లైఫ్ లో ప్రేమ ఎన్నో చేదు అనుభవాలను గురి చేసిందని… కానీ ఇప్పుడు వాటి నుంచి బయటపడిపోయినట్లు చెప్పిన ఈ కాంట్రవర్సీ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
కెరీర్ పరంగా డౌన్ అయిన కంగనా.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. ప్రముఖ బిజినెస్ మెన్ ను కంగనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని.. డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుని.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకోబోతుందన్న న్యూస్ వైరల్ గా మారింది. అయితే తన పెళ్లి వార్తలపై కంగనా ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడంతో నిజమోనని అనుకుంటున్నారు.
Discussion about this post