ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, ఎండుతున్న పంటలకు 25వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ ధాన్యంపై 500 బోనస్ ఇస్తే రైతులకు కొంత ఊరట లభిస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వారికి పెద్ద పీట వేశారని అన్నారు.
Discussion about this post