ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ల పంపిణీకి పది రోజుల సమయం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఆపేయాలని ఎవరు ఎన్నికల కమిషన్కు వెళ్లారని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు తిరిగి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Discussion about this post