మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో అమర్ రాజా కంపెనీతో తమ గ్రామాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా గ్రామస్తులు నిరవధిక నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. దీంతో పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ ఫ్యాక్టరీల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని గత ప్రభుత్వం నమ్మబలికిందన్నారు. ఇప్పుడేమో కాలుష్య కారక ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమ బాగోగులు పట్టించుకోని ప్రభత్వానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
Discussion about this post