
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. సబ్ మెరైన్, వార్ షిప్, జెట్, భూమి నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణియే కాదు.
భారతకు ‘బ్రహ్మాస్త్ర’ లాంటింది. ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే అవకాశం ఇవ్వదు. అలాంటి అద్భుతమైన క్షిపణిని ఇప్పుడు ఇండోనేషియా భారత్ నుంచి కొనుగోలు చేసే ఆలోచనలో కనిపిస్తుంది. ఈ మేరకు భారత్‌తో ఒప్పందం కుదిరినట్టు ఇండోనేషియా రక్షణశాఖ అధికారికంగా ప్రకటించింది.
ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ కొనుగోలుకు అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంక్ ద్వారా పూర్తి చేస్తోంది. బ్యాంకుతో సంబంధిత అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భారత్-ఇండోనేషియా దేశాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

మొదటి దశలో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి ఒక బ్యాటరీని కొనుగోలు చేయనుంది. అనంతరం దానిని దశలవారీగా పెంచే ప్రణాళిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసే రెండో దేశంగా ఇండోనేషియా నిలుస్తుంది.

గత ఏడాది నవంబర్‌లో ఇండోనేషియా రక్షణ మంత్రి స్యాఫ్రి స్యామ్‌సోయెద్దీన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని సందర్శించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు బ్రహ్మోస్ క్షిపణి మోడల్‌ను బహుమతిగా అందజేశారు. ఈ పర్యటన అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుంది.
ఇప్పటికే ఫిలిప్పీన్స్ 2022లో బ్రహ్మోస్ క్షిపణి మూడు బ్యాటరీలను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే మార్గంలో అడుగులు వేస్తోంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణిగా గుర్తింపు ఉంది. ఇందులో ఎగుమతి వర్షన్ సుమారు 290 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఇది యాంటీ-షిప్, భూభాగంపై దాడులు, తీర రక్షణ వంటి అనేక మిషన్లలో ఉపయోగించవచ్చు. శబ్ద వేగానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది.
భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయనున్న ఇండోనేషియా
ఒప్పందాన్ని అధికారికంగా ధృవీకరించిన ఇండోనేషియా రక్షణ శాఖ
సముద్ర భద్రత, సైనిక ఆధునికీకరణలో భాగంగానే ఈ నిర్ణయం
ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తున్న రెండో దేశం ఇండోనేషియా
‘ఆపరేషన్ సిందూర్’ విజయం తర్వాత బ్రహ్మోస్‌పై పెరిగిన అంతర్జాతీయ ఆసక్తి
Follow for more updates
