నెల్లూరులోని పెన్నానదీ తీరంలో కశ్యప మహాముని సాగించిన పౌండరీక యాగం నుంచి ఉద్భవించిన రంగనాధుడి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి 31 వరకు జరగనున్నాయని దేవాలయ కమిటీ తెలిపింది. మార్చి 31న తెప్పోత్సవంతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశాలతో రెవెన్యూ డివిజినల్ అధికారి మాలోల రూపొందించిన కార్యాచరణ మేరకు భక్తమండలి పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఆళ్వార్ ఆచార్యులు, పీఠాధిపతుల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు కొనసాగుతోన్నాయి. స్థానాచార్యుడు, అర్చకులు ఆధ్వర్యంలో ప్రబంధ గోష్టి, విశేష పుష్ఫ, ఆభరణ అలంకారాలు, ఉపచారికార్చనలు జరుగుతున్నాయి. ఆలయ భక్తమండలి అధ్యక్షులు ఎం శ్రీనివాసుల పర్యవేక్షణలో సాగుతోన్న వాహనోత్సవాల పై మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు.
Discussion about this post