ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మెయిన్స్‌ను మళ్లీ ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ బోర్డుకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది.
2018లో 167 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సిందేనని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు.
Discussion about this post