లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్త ఖరారైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు.. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు.
ఇరు పార్టీల పొత్తు ఖరారవ్వగా… త్వరలోనే ఇరు పార్టీల విధి విధానాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను కాపాడేందుకే ఈ పొత్తు పెట్టుకున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ… ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, మాయావతితో ఇంకా మాట్లాడలేదని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే మాట్లాడారని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Discussion about this post