స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలు అస్తవ్యస్తం అయ్యాయని, ఎంపీటీసీలకు కనీసం కుర్చీ కూడా కేటాయించకుండా అగౌరపరిచిందని అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం దానిని విస్మరించిందని చెప్పారు.
Discussion about this post