ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జిల్లా కేంద్రం మెదక్ లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని చెప్పారు. వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ శాశ్వతమని వివరించారు. వ్యవస్థను పటిష్టం చేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని చెప్పారు. 1.94 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు.






















Discussion about this post